![]() |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - International Women's Day |
మానవత్వం లేకుండా స్త్రీలపై ఆకృత్యాలు...
గర్భంలో ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయిస్తారు...
పిండంగా మారకముందే తుంచేస్తారు...
స్త్రీల దేహాలతో వ్యాపారం...వ్యభిచారం...
తరతరాల సామాజిక సమస్య... నేటికీ సజీవం...
మనకు కనిపించకుండా... మన చుట్టూ ఓ చీకటి ప్రపంచం...
అడుగడుగునా దళారులు...
మాయమవుతున్న అమ్మాయిల జాడ తెలియదు...
అమ్మాయిలను ప్రాణమున్న బొమ్మలుగా చేస్తారు...
వ్యభిచార కూపంలోకి నెట్టేస్తారు...
స్త్రీలను రాతిబొమ్మలుగా పూజిస్తారు...
రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించరు...
అతివలపై ఆధిపత్యం చలాయిస్తారు.... సైతానులాగా ప్రవర్తిస్తారు...
స్త్రీలను గౌరవించే దేశం మనది.... అయినా మహిళల ఆక్రందనలు ఆగవు....
-శ్రీచంద్ర, చిత్రకారుడు
No comments:
Post a Comment